నిరుద్యోగులకు రైల్వే శాఖ అదిరిపోయే తీపికబురు.. భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు!

దేశంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో రైల్వే శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 32,438 గ్రూప్ డి ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీ సంఖ్యలో లెవెల్ 1ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పది, ఐటీఐ అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఈ నెల 23వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి నెల 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ప్రముఖ ఆర్.ఆర్.బీ రీజియన్లలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 32,438 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటం నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది.

ఎస్ అండ్ టీ విభాగంతో పాటు మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, ట్రాఫిక్ విభాగాలలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. ఐటీఐ పాసైన వాళ్లు నిర్ధిష్టక శారీరక ప్రమాణాలను సైతం కచ్చితంగా కలిగి ఉండాలి. 2025 సంవత్సరం జులై 1 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడం ద్వారా అదిరిపోయే బెనిఫిట్స్ పొందవచ్చు.