రైల్వేశాఖ అదిరిపోయే తీపికబురు.. భారీగా గార్డ్, టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్!

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ మరో తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. rrccr.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సెప్టెంబర్ నెల 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ కాగా ఇంజనీర్, లోకో పైలట్, ట్రైన్ మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటిటీవ్ ఎగ్జామినేషన్ కోటాలో భాగంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. 2023 సంవత్సరం ఆగష్టు నెల 1వ తేదీ నాటికి రెగ్యులర్, అర్హత ఉన్న సెంట్రల్ రైల్వే ఉద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. పదవీ విరమణ చేసిన వాళ్లు మరో రైల్వే జోన్ కు బదిలీ అయిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉండరని తెలుస్తోంది.

ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వాళ్లు అసిస్టెంట్ లోక్ పైలట్ ఉద్యోగాలకు అర్హులు కాగా ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసిన వాళ్లు అర్హులు కాగా గార్డ్/ట్రైన్ మేనేజర్ ఉద్యోగాలకు ఏదైనా ఫీల్డ్ లో డిగ్రీ పాసైన వాళ్లు అర్హత కలిగి ఉంటారు. వేర్వేరు దశలలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. వెబ్ సైట్ లోకి వెళ్లి న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి వివరాలను ఎంటర్ చేసి ఈ ఉద్యోగాల్కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.