భారతీయ రైల్వే శాఖ ఎప్పటికప్పుడు కొత్త జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తూ నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూర్చుతోంది. తాజాగా రైల్వే శాఖ నుంచి 1303 ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడ్డాయి. రైల్వే శాఖ నుంచి మరో భారీ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ రైల్వే జూనియర్ ఇంజనీర్, లోకో పైలట్, గార్డ్ / ట్రైన్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
rrccr.com అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ నెల 2వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. జీడీసీఈ కోటా కింద ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతోంది. 2023 సంవత్సరం ఆగష్టు 1వ తేదీ నాటికి సెంట్రల్ రైల్వేలో రెగ్యులర్ ఉద్యోగి అయిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అసిస్టెంట్ లోకోపైలట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వాళ్లు ఇంజినీరింగ్ విభాగాల్లో 3 సంవత్సరాల డిప్లొమా కలిగి ఉండాలి. టెక్నీషియన్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వాళ్లు సైతం మూడేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు వయస్సు 42 ఏళ్లు కాగా ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 45 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 47 ఏళ్లు వయస్సు అర్హతగా ఉండనుందని సమాచారం అందుతోంది.
అసిస్టెంట్ లోకో పైలట్ 732, టెక్నీషియన్ 255, జూనియర్ ఇంజనీర్ 234, గార్డ్/ట్రైన్ మేనేజర్ 82 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడం ద్వారా భారీ స్థాయిలో బెనిఫిట్ కలిగే అవకాశం ఉంటుంది. రైల్వే శాఖ వరుస శుభవార్తలు చెబుతుండటంతో ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లు తెగ సంతోషిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు వేతనం కూడా భారీ స్థాయిలోనే ఉండనుందని తెలుస్తోంది.