యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 95 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. https://uohyd.ac.in/non-teaching-project-staff/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. ల్యాబొరేటరీ అటెండెంట్ ఉద్యోగ ఖాళీలు 8 ఉండగా హిందీ టైపిస్ట్ 1, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 44 ఉద్యోగ ఖాళీలు, లైబ్రరీ అసిస్టెంట్ 4 ఉద్యోగ ఖాళీలు, ఆఫీస్ అసిస్టెంట్ 10 ఉద్యోగ ఖాళీలు, స్టాటిస్టికల్ అసిస్టెంట్ 1, జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ 2, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ 1, జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్) 8 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీ 1 ఉండగా సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 2 ఉండగా సెక్యూరిటీ ఆఫీసర్ 2, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్) 2, సెక్షన్ ఆఫీసర్ 2, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 2, అసిస్టెంట్ లైబ్రేరియన్ 4, డిప్యూటీ రిజిస్ట్రార్ (డిప్యుటేషన్) ఒక ఉద్యోగ ఖాళీ ఉంది. అర్హత, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. సంస్థ హైదరాబాద్ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://uohyd.ac.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.