బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ తాజాగా భారీ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడంతో నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలగనుంది. మొత్తం 345 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని భోగట్టా. అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఈ మేరకు జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.
గ్రూప్ ఏ, బీ, సీ అనే మూడు కేటగిరీల ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. https://www.bis.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మైక్రోబయాలజీ, వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రిషీయన్, వైర్‌మ్యాన్, ఫ్లంబర్ ఉద్యోగ ఖాళీలతో పాటు మార్కెటింగ్ అండ్ కన్సుమర్ అఫైర్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్, హిందీ, మెకానికల్, కెమికల్, కార్పెంటర్ ఉద్యోగ ఖాళీలను సైతం ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ నెల 30వ తేదీ చివరి తేదీగా ఉండనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, టెక్నికల్ నాలెడ్జ్, ఇంటర్య్వూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరగనుంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.