ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 362 సెక్యూరిటీ అసిస్టెంట్‌/ మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌, 315 మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 677 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండటం గమనార్హం. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఈ ఉద్యోగ ఖాళీలలో హైదరాబాద్‌ సబ్సిడీ ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు 15 కేటాయించగా విజయవాడ సబ్సిడీ ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు 17 కేటాయించారు. పదోతరగతి పాసై, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవాళ్లు సెక్యూరిటీ అసిస్టెంట్‌/ మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఏడాది పని అనుభవంతో పాటు మోటార్‌ మెకానిజం పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటీఎస్‌ పోస్టులకు పదో తరగతి అర్హత కాగా 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉండనుంది. రాతపరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, వైద్యపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

2023 సంవత్సరం నవంబర్ 13వ తేదీ చివరి తేదీ కాగా www.mha.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.