కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. https://dst.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పీ.హెచ్.డీ పట్టా ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫార్మసీ, ఫిజిక్స్ విభాగాలలో సైంటిస్ట్ సీ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా డాక్టరేట్ సాధించి కనీసం నాలుగేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సైంటిస్ట్ డి విభాగంలో ఒకటి ఫార్మసీ విభాగంలో కెమిస్ట్రీ అండ్ బయో-టెక్నాలజీ విభాగంలో మరో పోస్ట్ ను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు కనీసం ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉండాలి. 40 సంవత్సరాల లోపు వయస్సు అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఐదేళ్ల వరకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
https://dst.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. https://dst.gov.in/administrationfinance/recruitment-cell లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం వేతనం లభించనుంది.
అర్హత కమిటీ, స్క్రీనింగ్-కమ్-షార్ట్‌లిస్టింగ్ కమిటీ, ఇంటర్వ్యూ బోర్డు ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుందని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో రాత పరీక్ష నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.