నవోదయ స్కూళ్లలో 1377 నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. మంచి వేతనంతో?

నవోదయ విద్యాలయ సమితి నిరుద్యోగులకు తీపికబురు అందించింది. నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. https://navodaya.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. త్వరలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 1377 నాన్ టీచింగ్ జాబ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.

ఈ ఉద్యోగ ఖాళీలలో మహిళా స్టాఫ్ నర్స్ ఉద్యోగ ఖాళీలు 121 ఉండగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు 5 ఉన్నాయి. ఆడిట్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 12 ఉండగా జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఉద్యోగాలు 4, లీగల్ అసిస్టెంట్ 1, మెస్ హెల్పర్ 442, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 381, క్యాటరింగ్ సూపర్‌వైజర్ 78, కంప్యూటర్ ఆపరేటర్ 2 , ఇతర ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పదో తరగతి, ఇంటర్‌తో పాటు సంబంధిత ఫీల్డ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే కలిగి ఉంటారు. https://navodaya.gov.in వెబ్ సైట్ ద్వారా నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ జాబ్ కు ఎంపికైన వాళ్లకు రూ. 18,000 నుంచి రూ.142,400 మధ్య వేతనం లభించనుందని తెలుస్తోంది. త్వరలో రాత పరీక్ష షెడ్యూల్ ను ప్రకటించనుండగా రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.