కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. టాలెంట్ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 10 మంది విద్యార్థులకు లక్ష రూపాయల చొప్పున పంపిణీ చేయనుంది. సపోర్ట్ టు స్టూడెంట్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ కాంపిటీషన్ అబ్రాడ్ పేరుతో బీటెక్ స్టూడెంట్స్ కోసం ఈ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం.
బీఈ, బీటెక్, ఎం.ఈ, ఎంటెక్ చదువుతున్న విద్యార్థులు ఇతర దేశాలలో జరిగే అంతర్జాతీయ పోటీలలో పాల్గొనడానికి వీలుగా ఈ స్కీమ్ అమలవుతోంది. విద్య నాణ్యతను పెంచడంతో పాటు విద్యార్థుల మధ్య పోటీతత్వాన్ని పెంచడం కోసం ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నారు. ఏఐసీడీఈ ఈ స్కీమ్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
https://www.myscheme.gov.in/schemes/sspca వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంస్థ న్యూఢిల్లీ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోటీకి ఎంపికైన వాళ్లకు ముందుగానే డబ్బులు చెల్లించడం జరుగుతుంది.
ఈ పోటీ కోసం ఎంపికైన వాళ్లు ప్రజంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఎంతో ప్రయోజనం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా అమలు చేస్తున్న పథకాలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.