రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్.బి.ఐ ) తాజగా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త తెలియజేసింది. ఇకపై బ్యాంకింగ్ రంగంలో కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఇటీవల నిర్వహించిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఆర్బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకు కస్టమర్లకు ఇప్పటికే ఎన్నో సర్వీసులు అందిస్తున్న ఆర్బిఐ తాజాగా దేశవ్యాప్తంగా 12 పట్టణాల్లో క్యూఆర్ కోడ్ ఆధారంగా పని చేసే కాయిన్ వెండింగ్ మెషీన్లను అందుబాటులో తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల కాయిన్స్ లభ్యత పెరగనుంది. ఈ మెషీన్ల ద్వారా నాణేల పంపిణీ పెరుగుతుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలియజేశారు.
ఈ కాయిన్ వెండింగ్ మెషీన్లు ద్వారా కస్టమర్లు కరెన్సీ నోట్లకు బదులు కాయిన్స్ పొందవచ్చు. గతంలో ఈ ఆటోమెటిక్ కాయిన్ వెండింగ్ మెషీన్స్ లో కరెన్సీ నోటు పెడితే దానికి సమానమైన మొత్తంలో కాయిన్లు పొందేవారు. కానీ ఇకపై ఇలా కాకుండా కరెన్సీ నోట్ల తో పని లేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా నాణేలను పొందొచ్చు. ఇలా పొందే డబ్బు నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచే డబ్బులు కట్ అవుతాయి. క్యూఆర్ కోడ్ బేస్డ్ వెండింగ్ మెషీన్ల ద్వారా యూపీఐ విధానంలో నేరుగా కాయిన్లు పొందొచ్చని ఆర్‌బీఐ వెల్లడించింది. అయితే పైలెట్ ప్రాజెక్ట్ కింద దేశవ్యాప్తంగా 12 పట్టణాల్లో మొదట ఈ వెండింగ్ మెషీన్లను తీసుకువస్తామని, ఆ తర్వాత వీటిని మరింత విస్తరిస్తామని ఆర్బిఐ తెలిపింది.
ప్రముఖ బ్యాంకులతో కలిసి క్యూఆర్ కోడ్ కాయిన్ వెండింగ్ మెషీన్లను తయారు చేశామని ఆర్‌బీఐ తెలిపింది. అలాగే ఈ కాయిన్ వెండింగ్ మెషీన్లు లైటింగ్ సెన్సార్స్, మ్యాగ్నటిక్ సెన్సార్ల ద్వారా పని చేస్తాయి. ఈ కాయిన్ వెల్డింగ్ మిషన్ల ద్వారా కరెన్సీ నోట్లతో అవసరం లేకుండా నేరుగా బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు కట్ అవుతుంది. ఈ కాయిన్ వెండింగ్ మిషన్స్ ని మొదట రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్ ప్లేస్‌లు వంటి ప్రదేశాలలో ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది . ఈ పైలెట్ ప్రాజెక్ట్‌కు వచ్చిన ఫలితాల ఆధారంగా, వీటిని మరింత ప్రోత్సహించడానికి బ్యాంకులకు మార్గదర్శకాలను రూపొందిస్తామని ఆర్‌బీఐ తెలిపింది.