ఆర్.బి.ఐ రెపో రేటు పెంచడం వల్ల అన్ని బ్యాంకులు ఫిక్స్ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు పెంచాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టింది. వీటి ద్వారా ప్రజల ఆర్థికంగా ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ వంటిదొర ప్రజలు ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ స్కీం లో ఇన్వెస్ట్ చేసిన వారికి బ్యాంకులు అధిక శాతం వడ్డీ రేటుని అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్స్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వారు 8 శాతం వరకు వడ్డీ సొంతం చేసుకోవచ్చు. అలాగే సుకన్య సమృద్ధి స్కీమ్‌పై అయితే వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. ఇంకా పీపీఎఫ్ పథకం పై అయితే 7.1 శాతం వడ్డీ రేటు పొందొచ్చు. కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) పథకంపై 7.2 శాతం వడ్డీ పొందవచ్చు.
అయితే ఈ స్కీమ్స్ అన్నింటి కన్నా ఒక బ్యాంక్ అధిక వడ్డీ రేటు అందుబాటులో ఉంచింది. బ్యాంక్‌లో డబ్బులు దాచుకుంటే మీరు ఈ సేవింగ్ స్కీమ్స్ కన్నా ఎక్కువ వడ్డీ రాబడి పొందొచ్చు. ఇంతకీ ఆ బ్యాంక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. జన స్మాల్ ఫైనాన్స్ అనే బ్యాంక్ తన కస్టమర్లకు ఏకంగా 8.85 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. అయితే ఇది సీనియర్ సిటిజన్స్‌కు వర్తిస్తుంది. అదే రెగ్యులర్ కస్టమర్లు అయితే 8.15 శాతం వరకు వడ్డీని సొంతం చేసుకోవచ్చు. అంటే ఇది సేవింగ్ స్కీమ్స్ కన్నా ఎక్కువ వడ్డీ రేటు అందిస్తోంది. బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపిజిట్ చేసే వారు అధిక రాబడి పొందొచ్చు. 7 రోజుల నుంచి 14 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4.45 శాతంగా ఉంది. 15 నుంచి 60 రోజుల వరకు ఎఫ్‌డీలపై అయితే 4.95 శాతం వరకు వడ్డీ పొందొచ్చు.
అలాగే 61 నుంచి 90 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.95 శాతం వరకు లభిస్తోంది.ఏడాది నుంచి 499 రోజుల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 7.95 శాతం దాకా వస్తోంది. 501 రోజుల నుంచి రెండేళ్ల వరకు టెన్యూర్‌పై అయితే 7.95 శాతం వరకు వడ్డీ వస్తుంది.ఇంకా రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 8.8 శాతం దాకా వస్తుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 8.05 శాతం వరకు వస్తుంది. ఐదేళ్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 7.95 శాతంగా ఉంది.ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు ఎఫ్‌డీలపై అయితే 6.7 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఇక 500 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 8.85 శాతం వరకు వస్తుంది.