తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. టీజీఎస్ ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీకి ఈ సంస్థ శ్రీకారం చుట్టింది. త్వరలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఈ పోస్టులలో డ్రైవర్ పోస్టులు 2000 ఉండగా శ్రామిక్ పోస్టులు 743 ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ (2) పోస్టులు 144 ఉండగా డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) పోస్టులు 84 ఉన్నాయి.
మెకానికల్/ఇంజనీర్ ఉద్యోగ ఖాళీలు 40, డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 25, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 14, సెక్షన్ ఆఫీసర్ (సివిల్) జాబ్స్ 11, అకౌంట్స్ ఆఫీసర్ 6 ఉద్యోగ ఖాళీలు, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 23 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది.
బీసీలకు మూడు సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపులు ఉండగా ఎస్సీ,ఎస్టీలకు ఐదేళ్లు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 25,500 నుండి రూ. 45,500 వరకు వేతనం లభించే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.
గత పది సంవత్సరాలలో కొత్తగా ఆర్టీసీ నియామకాలు చేపట్టలేదనే సంగతి తెలిసిందే. గత పదేళ్లలో కేవలం కారుణ్య నియామకాలను మాత్రమే నియమించ్దం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేయడం నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చుతోంది.