మాంసాహారం తిని గుడికి వెళ్తే పాపం తగులుతుందా.. చెయ్యకూడని తప్పులు ఇవే!

మాంసాహారం తిని గుడికి వెళ్లడం ఏ మాత్రం మంచిది కాదని పండితులు చాలా సందర్భాల్లో చెబుతారు. మాంసాహారం ముట్టని రోజులో మాత్రమే దేవాలయానికి వెళ్లాలి. పండితులు ఈ విధంగా చెప్పడం వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మాంసాహారం తీసుకుని గుడికి వెళ్తే కామ, వికార కోరికలు కలుగుతాయని పండితులు వెల్లడిస్తున్నారు. మాంసాహారం తింటే కోపం, కామం కలుగుతాయని వాళ్లు చెబుతున్నారు.

సాత్విక గుణాలతో దేవుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. దేవుడిని పూజించే సమయంలో ఉల్లి, వెల్లుల్లి, మసాలా దినుసులు కూడా తీసుకోకూడదని రజో గుణాలు ఉన్న వీటిని తీసుకోవడం వల్ల చెడు ఫలితాలు కలుగుతాయని పండితులు పేర్కొన్నారు. ఆంజనేయుడు, విష్ణుమూర్తి, శివాలయాల్లో మాంసాహారం నిషిద్ధం అని చెప్పవచ్చు. కొన్ని అమ్మవారి ఆలయాలకు మాత్రం మాంసాహారం తిని వెళ్లవచ్చు.

అదే సమయంలో పుణ్యక్షేత్రాలను సందర్శించి ఇంటికి వెళ్లే సమయంలో మాంసాహారం తీసుకోకూడదు. గుడికి వెళ్లడం గురించి సనాతన ధర్మంలో ఎన్నో ఆచారాలు ఉండగా వాటిని తప్పనిసరిగా పాటించాలి. మాంసారం అంతర్గత ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది కాబట్టి ఈ ఆహారానికి దూరంగా ఉంటే మంచిదని మరి కొందరు చెబుతున్నారు. తలస్నానం చేసి లేదా పుణ్యనదులలో స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి సాత్విక ఆహారం తీసుకుంటే మంచిది.

పెద్దలు, శాస్త్రాలు, ధ‌ర్మాలు, గ్రంధాలు చెప్పిన విషయాలను తప్పనిసరిగా పాటించాలి. ప్రస్తుతం కార్తీక మాసం కావడం కార్తీక సోమవారాలలో, కార్తీక పౌర్ణమి రోజున పాటించాల్సిన నియమాలను తప్పనిసరిగా పాటిస్తే మంచిదని చెప్పవచ్చు. కార్తీకమాసంలో పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలు సొంతం కావడంతో పాటు దేవుని అనుగ్రహం లభిస్తుంది.