తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందనే సంగతి తెలిసిందే. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా టెక్నికల్ విభాగంలో వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీకి తెలంగాణ హైకోర్టు సిద్ధమైంది. మొత్తం 342 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. టైపిస్ట్, కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగ ఖాళీలు భర్తీ కానున్నాయని సమాచారం అందుతుండటం గమనార్హం.
వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లు కావడంతో వేర్వేరు తేదీలలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. మే 25వ తేదీ నుంచి కాపీయిస్ట్ పోస్టుల భర్తీ జరగనుండగా ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా రూ.69,150 వరకు వేతనం లభిస్తుంది. జులై నెలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్షను నిర్వహిస్తారు.
ఇంటర్ పూర్తి చేసి టైపింగ్ హయ్యర్ సర్టిఫికేట్, టైపింగ్లోయర్ సర్టిఫికెట్ ఉత్తీర్ణత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 34 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు అర్హులు కాగా దివ్యాంగులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయని సమాచారం. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 600 రూపాయలు ఫీజు కాగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 400 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది.
100 మార్కులకు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష నిర్వహిస్తారని సమాచారం. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. టైపిస్ట్ ఉద్యోగ ఖాళీలు 144 ఉండగా జూన్ 15వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు కూడా నిబంధనలు ఇదే విధంగా ఉన్నాయి. https://tshc.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.