తెలంగాణ హైకోర్టులో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

తెలంగాణ హైకోర్టు నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 1673 ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. కంప్యూటర్ ఆపరేటర్, సిస్టమ్ అనలిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, టైపిస్ట్, ఎగ్జామినర్, అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, మొత్తం ఉద్యోగ ఖాళీలలో 1277 టెక్నికల్ ఉద్యోగ ఖాళీలు ఉండగా 184 నాన్ టెక్నికల్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

212 సబార్డినేట్ సర్వీస్, జ్యూడీషియల్ మినిస్టీరియల్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈరోజే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు, పీడీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు వయో పరిమితిగా ఉండనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని చెప్పవచ్చు. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 600 రూపాయలుగా ఉండగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 400 రూపాయలుగా ఉండనుంది.

అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేకూరనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.