సీ డ్యాక్ లో టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. భారీ వేతనంతో?

పుణె సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేస్తోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. టెక్నికల్ ఉద్యోగాలతో పాటు నాన్ టెక్నికల్ ఉద్యోగ ఖాళీలను సైతం భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. అర్హత ఉన్నవాళ్లు జూన్ 19వ తేదీన ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

మిషన్ కో ఆర్డినేటర్ ఒక ఉద్యోగ ఖాళీ ఉండగా ప్రోగ్రామ్ డైరెక్టర్ 2, ప్రాజెక్ట్ డైరెక్టర్ 2, డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ 1, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ 1, సీనియర్ మేనేజర్ అడ్మిన్ 1 ఉద్యోగ ఖాళీ ఉంది. సీఏ, సీఎంఏ్, ఐసీడబ్ల్యూఏ, బీఈ, బీటెక్, ఎంసీఏ, పీజీ, పీహెచ్డీ పాస్ కావడంతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. 1,50,000 రూపాయల నుంచి 2,80,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.

మిషన్ కో ఆర్డినేటర్ కు 63 సంవత్సరాలు ఏజ్ లిమిట్ కాగా ప్రోగ్రామ్ డైరెక్టర్, ప్రాజెక్ట్ డైరెక్టర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలకు 56 సంవత్సరాలు, ఇతర పోస్టులకు 50 సంవత్సరాలు ఏజ్ లిమిట్ గా ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఈ నెల 14వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలకు జూన్ నెల 20వ తేదీన, ఇతర ఉద్యోగ ఖాళీలకు 19వ తేదీ చివరి తేదీగా ఉండనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే సంస్థ వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.