గీతాంజలి ఇంజినీరింగ్ కాలేజీలో టీచింగ్,నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

గీతాంజలి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లా, కీసర మండలం, చేర్యాలలో ఉన్న ఈ కాలేజ్ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, హాస్టల్‌ వార్డెన్స్‌, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌, కంప్యూటర్‌ ప్రొగ్రామర్స్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇంగ్లిష్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ,సీఎస్‌ఈ, సీఎస్‌ఈ(సీఎస్‌,ఏఐఎమ్‌ఎల్‌, డీఎస్‌),ఈసీఈ విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఇంటర్‌, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. jobopening@gcet.edu.in మెయిల్ ఐడీకి ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన రెజ్యుమెను పంపాల్సి ఉంటుంది.

2023 సంవత్సరం అక్టోబర్ 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత కాలేజ్ ను సంప్రదించడం ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అనుభవం ఆధారంగా ఎంపికైన వాళ్లకు వేతనం లభించనుంది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుండగా టీచింగ్,నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ లో పని చేయాలని భావించే వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరుగుతుంది.