దేశంలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉంటారు. మోదీ సర్కార్ బ్యాంక్ అకౌంట్ లేని వాళ్లకు ప్రయోజనం చేకూరేలా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. బ్యాంక్ లో డబ్బులను దాచుకోవడం వల్ల వడ్డీని పొందడంతో పాటు ఎలాంటి సందర్భాల్లో అయినా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. అయితే బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్నవాళ్లు 50 వేల రూపాయల వరకు ఆదా పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉన్న సీనియర్ సిటిజన్స్ సెక్షన్ 80 టీటీబీ కింద 50,000 రూపాయల వరకు తగ్గింపును పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పాత పన్ను విధానం ఎంచుకున్న వాళ్లు సులభంగా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే ఛాన్స్ ఉంటుంది. ఒకటి లేదా రెండు బ్యాంక్ అకౌంట్ లను కలిగి ఉంటే మంచిది. ఎక్కువ సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటే ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.
ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నవాళ్లు సైతం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ కాలం బ్యాంక్ అకౌంట్ వాడకుండా ఉంటే మాత్రం ఆ అకౌంట్ ను సులువుగా క్లోజ్ చేయవచ్చు. సేవింగ్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ ను కచ్చితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ నుంచి ఛార్జీలు కట్ అవుతాయి.
కొన్ని నెలల పాటు బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ నెగిటివ్ లోకి వెళ్లిపోతుంది. ఏటీఎం కార్డ్ ఛార్జీలు, ఎస్.ఎం.ఎస్ ఛార్జీలతో పాటు ఇతర ఛార్జీలు సైతం కట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉన్నవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.