మనలో చాలామంది చింతచిగురుతో చేసిన వంటకాలను తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. షుగర్ సమస్యతో బాధ పడేవారు చింతచిగురు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని చెప్పవచ్చు. ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడేవాళ్లు చింతచిగురు తీసుకోవడం వల్ల ఆ సమస్య సులువుగా దూరమవుతుంది. చింతచిగురు తీసుకోవడం ద్వారా కంటి సంబంధిత సమస్యలకు సైతం చెక్ పెట్టవచ్చు.
వేసవి కాలంలో ఎక్కువగా లభించే చింతచిగురు వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవు. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. చింత చిగురు తీసుకోవడం ద్వారా మలబద్ధకం సమస్య దూరమవుతుంది. పైల్స్ సమస్యతో బాధపడేవాళ్లకు చింతచిగురు సంజీవని అని చెప్పవచ్చు. చింతచిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఇది తోడ్పడుతుంది.
వైరస్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టేలా చేయడంలో చింతచిగురు ఉపయోగపడుతుంది. వణుకుతూ వచ్చే జ్వరం తగ్గాలంటే చింత చిగురును ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిది. చింత చిగురును ఉడికించిన నీటిలో వేసి పుక్కిలించడం ద్వారా గొంతు నొప్పి, మంట, వాపు సమస్యలు దూరమవుతాయి. నోటిలో వచ్చే పగుళ్లు, పూతలకు చెక్ పెట్టడంలో చింతచిగురు ఎంతగానో సహాయపడుతుంది.
రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఎక్కువగా ఉండగా చింత చిగురు తీసుకోవడం వల్ల గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చు. జీర్ణాశయ సంబంధ సమస్యలకు చెక్ పెట్టడంలో చింత చిగురు ఉపయోగపడుతుంది. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన ఇమ్యూనిటీ పవర్ లభిస్తుంది.