మనలో చాలామంది ఏదో ఒక సందర్బంలో పాదాల వాపు సమస్యతో బాధ పడుతూ ఉంటారు. పాదాల వాపు సామాన్యంగా అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే సమస్యలలో ఒకటి కావడం గమనార్హం. నిలబడి ఎక్కువ సేపు పని చేసినా లేదా ఎక్కువ సమయం పాటు ప్రయాణం చేసినా పాదాల వాపు వచ్చే అవకాశం ఉంటుంది. పాదాల వాపు ఇబ్బంది పెడుతుంటే కొన్ని చిట్కాలను పాటిస్తే మంచిది.
పాదాల వాపు సమస్యతో బాధ పడేవాళ్లు పాదాలు కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి. పాదాలను ఈ విధంగా ఎత్తులో పెట్టుకోవడం ద్వారా బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉండి వాపు తగ్గే అవకాశాలు ఉంటాయి. విశ్రాంతి తీసుకునే సమయంలో పాదాలను దిండుపై పెట్టుకుంటే మంచిది. రోజులో కనీసం 20 నిమిషాలు అయినా ఈ విధంగా చేస్తే మంచిది. ఎక్కువ సమయం నిలబడితే పాదాలపై ప్రెజర్ పడే అవకాశం ఉంటుంది.
ఎక్కువ సేపు కూర్చుని పని చేసే వాళ్లకు సైతం పాదాల వాపు సమస్య వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సహజంగా పాదాల వాపు రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే వస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. శరీరానికి అవసరమైన స్థాయిలో నీళ్లు తాగడం ద్వారా కూడా పాదాల వాపు సమస్యకు చెక్ పెట్టవచ్చు. పాదాలను ఉప్పునీటిలో కొంత సమయం ఉంచితే పాదాల వాపు తగ్గుతుంది.
ఎప్సం సాల్ట్ ను మజిల్ పెయిన్ నీ, ఇంఫ్లమేషన్ నీ, స్వెల్లింగ్ నీ తగ్గించడం కోసం ఉపయోగించుకోవచ్చు. శరీరం లోంచి టాక్సిన్స్ ని బైటికి పంపించడంలో పాదాల వాపు ఉపయోగపడుతుంది. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కూడా పాదాల వాపుకు చెక్ పెట్టవచ్చు. మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే కూడా పాదాల వాపు వచ్చే అవకాశం ఉంటుంది.