ఇంగువ తీసుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా.. బరువుతో పాటు ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చా?

మనలో చాలామంది ఇంగువను వాడటానికి ఎక్కువగా ఇష్టపడరు. ఇంగువ వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉంటుంది. సహజంగా జీవక్రియను మెరుగుపరిచే విషయంలో ఇంగువ ఉపయోగపడుతుంది. యునాని, సిధా, ఆయుర్వేద మెడిసిన్ తయారీలో ఇంగువను వాడతారు. యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న ఇంగువ ఎన్నో వ్యాధులను నయం చేస్తుంది.

రక్తపోటును తగ్గించే విషయంలో ఇంగువ తోడ్పడుతుంది. జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులను నయం చేయడంలో ఇంగువ ఉపయోగపడుతుంది. ఒంట్లో అధికంగా ఉన్న వేడిని తరిమేయడంలో ఇంగువ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మన శరీరంలో వేడి పెరిగేకొద్దీ మన బాడీలో కణాలు చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఆస్తమా ఉన్నవారు, దగ్గు, జలుబు ఉన్నవాళ్లు ఇంగువ తీసుకుంటే మంచిది.

అజీర్తి, గ్యాస్, అసిడిటి, కడుపు ఉబ్బరం సమస్యలకు ఇంగువ ఉపయోగపడుతుంది. గ్యాస్ సమస్యలను దూరం చేయడంలో ఇది తోడ్పడుతుంది. హైబీపీతో బాధపడేవారికి ఇంగువ ఉపయోగపడుతుంది. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడంఓ్ పాటు జుట్టును బలంగా చేయడంలో ఇంగువ ఉపయోగపడుతుంది. ఇంగువ పొడిని కూరల్లో వాడితే మంచిది. ఇంగువ పొడిని కొబ్బరి నూనెలో కలిపి దురద ఉన్న చోట రాసుకుంటే మంచిది.

పిల్లలకు నులిపురుగుల సమస్య ఉన్నా టీ స్పూన్ ఇంగువ పొడిని నీటిలో కలిపి తాగాల్సి ఉంటుంది. వంటలలో ఉపయోగించే ఈ ఔషధ మూలికను మగవారిలో నపుంసకత్వం తగ్గించేందుకు ఉపయోగిస్తారు. మలబద్ధకం ఉన్నవారు రాత్రి పడుకోబోయేముందు ఇంగువ చూర్ణం తీసుకుంటే మంచిది. స్వచ్చమైన ఇంగువను ఎంచుకోవడం ద్వారా ఈ బెనిఫిట్స్ ను పొందవచ్చు.