లా గ్రాడ్యుయేట్స్‌కు అదిరిపోయే తీపికబురు.. 80,000 జీతంతో అదిరిపోయే ఉద్యోగ ఖాళీలు!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు లా క్లర్క్-కమ్-రీసెర్చ్ అసోసియేట్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ను తాజాగా మొదలుపెట్టింది. సుప్రీంకోర్టు అధికారిక పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. main.sci.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కొరకు సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 సంవత్సరం జనవరి 24వ తేదీన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

2024 సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం 90 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని తెలుస్తోంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత కలిగి ఉంటారు. 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడేళ్ల లా కోర్సులో చివరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థులతో పాటు ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో జాయిన్ అయ్యి ఐదో సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. రీసెర్చ్ అండ్ అనలైటికల్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు యూకో బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఆన్‌లైన్‌లో 500 రూపాయల దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, రాత, విశ్లేషణాత్మక నైపుణ్యాలను పరీక్షించడం ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్లకు 80,000 రూపాయల వేతనం లభిస్తుంది.