ఎల్ఐసి లో అదిరిపోయే సూపర్ ప్లాన్… లోన్ పొందే అద్భుతమైన అవకాశం!

ప్రముఖ భీమా రంగ కంపెనీలలో ఒకటైనటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఎన్నో రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఎన్నో సరికొత్త పథకాల ద్వారా ఎంతో మందికి ఆర్థిక భరోసాన్ని కల్పించినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మరొక అదిరిపోయే అద్భుతమైన అవకాశాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎల్ఐసి లో డబ్బులు పొదుపు చేయడం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను అందిస్తుంది. ఇలా తక్కువ పెట్టు అధిక లాభాలను అందించే వాటిలో బీమా రత్న పాలసీ కూడా ఒకటి.

ఎల్ఐసీ బీమా రత్న పాలసీతో మీరు మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ. 76 లక్షలు పొందొచ్చు. ఇది నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివీజువల్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది మనీ బ్యాక్ పాలసీ అని చెప్పవచ్చు అంతేకాకుండా ఇది మనీ బోనస్ పాలసీ అని కూడా చెప్పవచ్చు.ఇక ఈ పాలసీ గరిష్టంగా ఐదు లక్షల వరకు పొందాల్సి ఉంటుంది. ఇందుకు వయో పరిమితి అంటూ ఏమీ లేదు. ప్రీమియం మొత్తాన్ని నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున చెల్లించవచ్చు..

ప్లాన్ ను 15 ఏళ్లు, 20 ఏళ్లు, 25ఏళ్లు టెన్యూర్‌తో తీసుకోవచ్చు. మీకు నచ్చిన టెన్యూర్ ఎంచుకోవచ్చు. 15 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే ప్రీమియం 11 ఏళ్లు కట్టాలి. అలాగే 20 ఏళ్ల టెన్యూర్ అయితే 16 ఏళ్లు ప్రీమియం చెల్లించాలి. ఇక 25 ఏళ్లు టెన్యూర్ అయితే 21 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పాలసీ దారుడు మరణిస్తే.. నామినీకి ఆ డబ్బులు అందుతాయి..అంతేకాదు ఈ పాలసిని వారికి లోన్ ఫెసిలిటీ కూడా లభిస్తుంది. పాలసీ తీసుకున్న తర్వాత రెండెళ్లు పూర్తిగా ప్రీమియం చెల్లిస్తే.. వారికి లోన్ పొందే అర్హత లభిస్తుంది.