మండే ఎండలో బయటికి వెళుతున్నారా.. తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

ఈ మధ్య కాలంలో ఎండలు మండిపోతున్నాయి. రోడ్డుపై అడుగులు వేయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భానుడి భగభగలకు కొండలు సైతం రెండుగా చీలుతున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎండవేడి వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురై ఆస్పత్రులలో చేరుతున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వడదెబ్బ తగిలితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

శరీర్ ఉష్ణోగ్రతలలో ఎలాంటి మార్పు రాకపోయినా చెమట పట్టకపోయినా వడదెబ్బ తగిలిందని గుర్తించాలి. ఎండలో వెళుతున్న సమయంలో కళ్లు తిరుగుతున్నా జాగ్రత్త పడాలి. శరీరానికి అవసరమైన స్థాయిలో నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు. వడదెబ్బ తగిలితే చల్లని నీటితో శరీరాన్ని శుభ్రపరిస్తే మంచిది. గ్లూకోజ్ లేదా మజ్జిగ తాగి ఆ తర్వాత వైద్యులను సంప్రదించాలి.

కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. బయటకు వెళ్లే సమయంలో వదులుగా ఉండే దుస్తులను ధరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశాలు అయితే ఉంటాయి. గొడుగు, టీపీ ధరించి ఎండకు వెళితే మంచిది. బయటకు వెళ్లే సమయంలో సన్ స్క్రీన్ లోషన్ ను రాస్తే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

గ్లూకోజ్ కలిపిన నీళ్లను తరచూ తాగడం ద్వారా ఎండ సంబంధిత సమస్యలు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ నీళ్లను తాగడం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని చెప్పవచ్చు.