నిమ్మ రసాన్ని, కొబ్బరి నీళ్లతో కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

తరచు కొబ్బరి నీళ్లను తాగడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి నీళ్లలో పుష్కలంగా ఉన్న ప్రోటీన్స్,పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్స్ మరియు ఇతర ఎలక్ట్రోలైట్‌లు మన శరీరం కోల్పోయిన ఖనిజలావనాలను తిరిగి వేగంగా మన శరీరానికి అందించి మనలో శక్తి సామర్థ్యాలను పెంచే సహజ ఎనర్జీ డ్రింక్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా వేసవి సీజన్లో శీతల పానీయాలు తాగడానికి బదులు కొబ్బరి బొండంలో నిమ్మరసం కలుపుకొని సేవిస్తే డిహైడ్రేషన్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడం తోపాటు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు న్యూట్రిషన్ నిపుణులు.

కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి తీసుకుంటే మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే అద్భుత టానిక్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా కొబ్బరి నీరు, నిమ్మ రసం రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్ సి పొటాషియం,ఇతర ఎలక్ట్రోలైట్‌లు ఎక్కువగా ఉండడంవల్ల వేసవిలో అందర్నీ ఇబ్బంది పెట్టే వడదెబ్బ సమస్య నుంచి రక్షణ పొందవచ్చు. తరచూ అలసట అనే రసం చికాకు వంటి లక్షణాలతో బాధపడుతుంటే కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి సేవిస్తే శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపి అలసట, నీరసం మంటి లక్షణాలను తొలగించి మానసిక ఆనందాన్ని పెంపొందిస్తుంది.

జీర్ణ సమస్యలతో బాధపడే వారికి కొబ్బరి నీళ్లు, నిమ్మరసం కలిపిన అద్భుత పానీయం చక్కగా పనిచేస్తుంది. జీర్ణ సమస్యలు తొలగించడమే కాకుండా ఒంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను, చెడు వ్యర్ధాలను బయటికి పంపడంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, అధికంగా శ్రమించేవారు ప్రతిరోజు ఈ ఎనర్జీ డ్రింక్ సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.హై బీపీ సమస్య, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీళ్లలో నిమ్మరసాన్ని కలిపి సేవిస్తేఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడి వ్యాధి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ డ్రింక్ ను తాగాలనుకుంటే నిపుణుల అభిప్రాయం తీసుకోవడం మంచిది.