ఈ చిట్కాతో బతికినంత కాలం మంచి ఆరోగ్యం మీ సొంతం!

ప్రస్తుత ఆహార అలవాట్లలో మార్పుల వల్ల ఎక్కువగా పని చేయలేక నీరసం, నిస్సహాయత, ఓపిక కోల్పోవడం, చిన్న చిన్న వాటికే అనారోగ్యం తో మందులు వాడడం సర్వసాధారణంగా మారిపోయింది.

పూర్వకాలంలో ఉండే మనుషులతో పోల్చుకుంటే మనం చాలా బలహీనంగా, చేతకానివారీగా మారాము అనడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఇది అందరికీ తెలిసిందే. మరి సహజ పద్ధతిలో ఆరోగ్య సమస్యలు ఏమీ లేకుండా హాయిగా జీవించాలంటే దీనితోనే సాధ్యం అవుతుంది.

ఒక గిన్నెలో రెండు స్పూన్ల నువ్వులు తీసుకోండి. అవి నల్లవి అయినా లేదా తెల్లవేనా పర్వాలేదు. నువ్వుల ద్వారా గుండెకు, మెదడుకు, ఎముకలకు కావలసిన పోషణ అందుతుంది. ఇందులో క్యాల్షియం, ప్రోటీన్లు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. తరువాత రెండు స్పూన్ల గసగసాలు తీసుకోవాలి. ఈ గసగసాలలో ఒమేగా త్రీ, ఒమేగా సిక్స్, కాల్షియం, మెగ్నీషియం, పుష్కలంగా ఉండి నిద్ర సమస్య లేకుండా చేయడమే కాదు.

శరీరానికి కావలసిన కొవ్వు పదార్థాలను సమకూర్చి పెడుతుంది. తరువాత 8 లేదా 10 బాదాం విత్తనాలను తీసుకోవాలి. ఇందులో గుండెకు కావలసిన మంచి పోషకాలు అయిన కాల్షియం,ప్రోటీన్లు, ఫైబర్లు కావలసినంత ఉంటాయి. తరువాత కాస్త పట్టిక బెల్లం లేదా మామూలు బెల్లం అయినా వేసి మిక్సీ వేయించుకోవాలి. ఇందులో పంచదారను వాడకూడదు ఎందుకంటే పంచదారలో ఏ విధమైనటువంటి పోషకాలు ఉండవు.

తరువాత ఒక గిన్నెలో ఒక గ్లాసు వరకు ఆవు పాలు తీసుకుంటే మంచిది ఎందుకంటే ఆవు పాలలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఇది లభించని పక్షంలో గేదె పాలు అయినా సరిపోతుంది. పాలను బాగా వేడి చేసి అందులో ఈ పొడిని వేసి తర్వాత ఒక బెల్లం ముక్కను వేయాలి. చల్లటి పాలలో వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి పాలు మరిగిన తర్వాతనే చేయాలి.

ఈ పాలను ఉదయం లేదా సాయంత్రం తాగవచ్చు. సాయంత్రం పూట అయితే రాత్రి బాగా నిద్ర పట్టి ఉదయం బలంగా ఉత్సాహంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ పాలు వద్దు అనుకుంటే ఒక స్పూన్ ఈ మిశ్రమాన్ని తిని ఆ తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిని తాగితే సరిపోతుంది.