ఇంటర్ అర్హతతో 7547 కానిస్టేబుల్ ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ మధ్య కాలంలో వరుసగా శుభవార్తలు చెబుతూ నిరుద్యోగులకు తీపికబురు అందిస్తోంది. 7547 ఖాళీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేయనుండగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా సెప్టెంబర్ 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అక్టోబర్ 3, 4 తేదీలలో సవరణలు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్యం, ఇతర పరీక్షల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ 14 నుండి డిసెంబర్ 5, 2023 వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నారు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఒకింత భారీ వేతనం లభించనుండగా ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.

రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు రూల్స్ ప్రకారం వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 69,100 రూపాయల వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకోవడంతో పాటు సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది.