స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మల్టీ టాస్కింగ్ స్టాప్ (నాన్ టెక్నికల్), హవల్దార్ ఉద్యోగ ఖాళీల కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 2023 సంవత్సరం జులై 21వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. జులై 26వ తేదీ నుంచి జులై 27వ తేదీ వరకు దరఖాస్తు సులభంగా ఎడిట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
2023 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్) 1198 ఉద్యోగ ఖాళీలు ఉండగా హవల్దార్ ఉద్యోగ ఖాళీలు 360 ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు గరిష్టంగా 25 సంవత్సరాలు వయస్సు కాగా ఇతర ఉద్యోగాలకు గరిష్టంగా 27 సంవత్సరాల వయస్సు ఉంది. పదవ తరగతి లేదా మెట్రిక్యులేషన్ లేదా సమాన పరీక్ష పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండనుందని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఎక్స్ సర్వీస్మెన్, మహిళలకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. రాతపరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది.
త్వరలో ఈ పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్ ద్వారా ఈ పరీక్షలు జరుగుతాయి. అధికారిక పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.