పదో తరగతి అర్హతతో పోస్టాఫీస్ ఉద్యోగ ఖాళీలు.. ఏకంగా 30 వేల వేతనంతో?

ఈ మధ్య కాలంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ సిద్ధమవుతూ ఉండటం గమనార్హం. భారీ సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా పోస్టల్ డిపార్ట్‌మెంట్ రెడీ అవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల విడుదల కాలేదు.

గతేడాది 40 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసిన నేపథ్యంలో ఈసారి 30 వేల ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌, డాక్ సేవక్ విధులను నిర్వహించాల్సి ఉంటుంది.

ఆన్ లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు వేతనం లభిస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్స్ వల్ల దీర్ఘకాలంలో ఎంతో బెనిఫిట్ అయితే కచ్చితంగా కలుగుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

పోస్టాఫీస్ ఉద్యోగ ఖాళీలను సాధించాలనేది చాలామంది కల కాగా ఆ కలను సులువుగానే నెరవేర్చుకునే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పదో తరగతి అర్హతతో ఉద్యోగ ఖాళీలు కోరుకునే వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలపై ఫోకస్ పెడితే బాగుంటుందని చెప్పవచ్చు.