స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఎప్పటికప్పుడు శుభవార్తలు చెబుతుండగా తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో అదిరిపోయే తీపికబురును అందించింది. భారీ వేతనంతో 75,768 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కేంద్ర సాయుధ బలగాలలో భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.
నవంబర్ నెల 24వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండగా డిసెంబర్ 28వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్ లైన్ పరీక్షను నిర్వహిస్తారు. ఫిబ్రవరి నెలలో ఆన్ లైన్ విధనంలో పరీక్షజరగనుండగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో మేలు జరగనుందని చెప్పవచ్చు.
వేర్వేరు విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండటం గమనార్హం. బీ.ఎస్.ఎఫ్ లో ఉద్యోగ ఖాళీలు 27,875 ఉండగా సీ.ఐ.ఎస్.ఎఫ్ లో 8,598 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. సీఆర్పీఎఫ్ లో 25,427 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఎస్.ఎస్.బీలో 5,278 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఐటీబీపీలో 3,006 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఏఆర్ లో 4776 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 56,900 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.
23 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా అర్హత ఉన్నవాళ్లకు వయోపరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మేన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఆబ్జెక్టివ్ పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి.