నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో 1600 జాబ్స్!

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ మధ్య కాలంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. 1600 ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2023 నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. వేర్వేరు సంస్థలలో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని సమాచారం. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ (గ్రేడ్‌-ఎ) ఉద్యోగ ఖాళీలు కూడా భర్తీ కానున్నాయి.

భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలకు జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది. కనీసం ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుంచి అర్హత ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అర్హత కలిగి ఉంటారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఒకింత భారీ వేతనం లభించనుంది. రాబోయే రోజుల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరిన్ని జాబ్ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాబోయే రోజుల్లో వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ చేస్తుండటం గమనార్హం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వల్ల నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్స్ వల్లే వేల సంఖ్యలో ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలన్న కలను నెరవేర్చుకుంటున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ నోటిఫికేషన్ల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.