స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 7500 ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. 7500 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ నెల 3వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. కంబైండ్ గ్యాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2023 తాజాగా విడుదలైంది. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుండటంతో నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది.

 

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ అఫీసర్ ఉద్యోగ ఖాళీలతో పాటు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. మే నెల 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంటుందని సమాచారం అందుతోంది.

 

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉండగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మేన్లకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. మే నెల 4వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి 4వ తేదీ చివరి తేదీగా ఉంది. అప్లికేషన్ లో ఏవైనా తప్పులు ఉంటే మే 7వ తేదీ నుంచి మే 8వ తేదీలోగా కరెక్షన్ చేసుకోవచ్చు.

 

టైర్1 పరీక్ష 2023 సంవత్సరం జులై నెలలో జరగనుండగా టైర్2 పరీక్ష తేదీకి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. టైర్2 పరీక్ష తేదీకి సంబంధించి స్పందించాల్సి ఉంది.