ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల కొరకు జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 66 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2023 సంవత్సరం నవంబర్ 19వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

ఈ ఉద్యోగాలలో మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 59 ఉండగా సీనియర్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలు 5, చీఫ్ మేనేజర్ ఉద్యోగ్ ఖాళీలు 2 ఉన్నాయి. బీటెక్, పీజీ, ఎంబీఏ, ఎంటెక్, ఇతర విద్యార్హతలు ఉన్నవాళ్లు అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మేనేజర్ ఉద్యోగాలకు 25 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు అర్హులు కాగా సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు 30 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.

చీఫ్ మేనేజర్ ఉద్యోగాలకు మాత్రం 30 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు అర్హత కలిగి ఉంటారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అర్హతల ఆధారంగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 175 రూపాయలు కాగా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 850 రూపాయలుగా ఉంది.

ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు దేశంలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 89,890 రూపాయల వరకు వేతనం లభించనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.