పదో తరగతి అర్హతతో భారీ సంఖ్యలో రైల్వే ఉద్యోగ ఖాళీలు.. మంచి జీతంతో?

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 548 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే , బిలాస్ పూర్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మే 3వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

 

జూన్ 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. ట్రేడ్ లలో వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఉండగా అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. 24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హతలను కలిగి ఉంటారని చెప్పవచ్చు. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపులు ఉంటాయి.

 

https://www.apprenticeshipindia.gov.in/candidate-login వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సంబంధిత ట్రేడ్ లో ఐటీఐతో పాటు ఎన్సీవీటీ సర్టిఫికెట్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

 

జూన్ 3వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.