రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. బీటెక్ గ్రాడ్యుయేట్లకు మేలు చేకూరేలా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఈ సంస్థ జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను ను మొదలుపెట్టింది. అప్లికేషన్ ప్రాసెస్ జులై 30న మొదలుకానుండగా ఆగస్టు 29 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
కెమికల్ సూపర్‌వైజర్ (రీసెర్చ్), మెటలర్జికల్ సూపర్‌వైజర్ (రీసెర్చ్) ఉద్యోగ ఖాళీలతో పాటు జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 7951 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అర్హత ఉన్నవాళ్లు ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.
18 నుంచి 36 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ విభాగాలలో బీటెక్ చదివిన విద్యార్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఆర్.ఆర్.బీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉంది. మూడు దశల్లో ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. అభ్యర్థుల ఫైనల్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ను విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 35,400 రూపాయల వేతనం లభిస్తుంది.