ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 458 ఉద్యోగ ఖాళీల కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా జులై 26వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఈ ఉద్యోగ ఖాళీలలో జనరల్ కేటగిరీకి సంబంధించి 195 ఉద్యోగ ఖాళీలు ఉండగా మిగతా వాళ్లకు 263 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని సమాచారం అందుతోంది.
గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో భారీ స్థాయిలో సడలింపులు ఉన్నాయని సమాచారం.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఓబీఎస్, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉండనుంది. ఇతరులకు మాత్రం ఫీజు మినహాయింపు ఉండనుందని తెలుస్తోంది. https://www.itbpolice.nic.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. హోమ్ పేజ్ పై క్లిక్ చేసి రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఇతర పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.