పది అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 548 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పదో తరగతి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే , బిలాస్ పూర్ నుంచి ఈ భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ సంస్థ నుంచి రిలీజైన నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

ఈరోజే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు కావడంతో వేగంగా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. డ్రాఫ్ట్స్ మెన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మిషనిస్ట్, పెయింటర్, ప్లంబర్, షీట్ మెటల్ వర్క్ ఉద్యోగ ఖాళీలతో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

https://www.apprenticeshipindia.gov.in/candidate-login వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ, ఎన్.సీవీటీ సర్టిఫికెట్ ఉన్న ఉద్యోగులు ఈ ఉద్యోగాలకు అర్హులు. పలు వర్గాల వాళ్లకు వయోపరిమితిలో సడలింపులు ఉండగా వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరగనుంది. పది అర్హతతో జాబ్ నోటిఫికేషన్ కావడంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.

చిన్న వయస్సులోనే జాబ్ పొందాలని భావించే వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.