మన దేశంలో చాలామంది ఇతర దేశాల్లో చదువుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఆ కలలను నెరవేర్చుకోవడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే స్కాలర్ షిప్ పొందే అవకాశం ఉంటే మాత్రం సులువుగా చదువుకోవచ్చు. ప్రముఖ సంస్థలు స్కాలర్ షిప్ అందించడం ద్వారా మెరిట్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాయి. ఈ స్కాలర్ షిప్ లలో ఫ్రాన్స్ ఎక్సలెన్స్ ఛార్పిక్ స్కాలర్‌షిప్ కూడా ఒకటి కావడం గమనార్హం.
అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ స్కాలర్లు ఫ్రాన్స్ లో అడ్మిషన్ పొందితే ఆ దేశ ప్రభుత్వం స్టైఫండ్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. https://www.inde.campusfrance.org వెబ్ సైట్ ద్వారా స్కాలర్ షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ కు ఎంపికైన వాళ్లకు రూ.76,000 స్కాలర్ షిప్ లభించనుందని తెలుస్తోంది.
మన దేశ విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ ను కలిగి ఉండి 23 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సెకండరీ పాఠశాల విద్యను పూర్తి చేసి బ్యాచిలర్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసిన వాళ్లు ఈ స్కాలర్ షిప్ ను పొందవచ్చు.
పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోగ్రాఫ్, పాస్‌పోర్ట్ కాపీ, కరికులం విటే, ఇతర సర్టిఫికెట్లు ఉన్నవాళ్లు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు. సంబంధిత వెబ్ సైట్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య చదవడానికి ఆసక్తి చూపుతున్న భారతీయ విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ ద్వారా బెనిఫిట్ కలగనుందని చెప్పవచ్చు.