బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 75000 రూపాయల వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. ఆయుష్, సివిల్, కెమికల్, ట్రాన్స్‌పోర్ట్ ఇంజినీరింగ్, ఇతర విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. మొత్తం 107 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండగా ఏడాది కాలానికి ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు ఢిల్లీలో పని చేయాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. bis.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. డిసెంబర్ 30 నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
2024 సంవత్సరం జనవరి నెల 19వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత ఉన్నవాళ్లకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదని తెలుస్తోంది. ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ నుండి మాస్టర్స్, పిహెచ్‌డి డిగ్రీ వరకు విద్యార్హతలు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు.
అర్హత, అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగానే ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎక్కువ మొత్తంలో వేతనం లభించే అవకాశం ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది.