మందారం పూల మొక్కలు మన అందరి ఇంటి పెరట్లో కచ్చితంగా ఉంటాయి. ఇవి అందమైన పూలను ఇవ్వడంతో పాటు జుట్టు సమస్యలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మందార ఆకులు మరియు పూలల్లో సహజ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ గుణాలు, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి కావున మన జుట్టు సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.మందార పువ్వులను ఆకులను మెత్తని మిశ్రమంగా మార్చుకొని అందులో కొబ్బరి నూనె వేసి తల చర్మానికి మర్దన చేసుకుని 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తల స్నానం చేస్తే జుట్టు రాలడం, జుట్టు చిట్లడం వంటి సమస్యలు తగ్గి జుట్టు నల్లగా దృఢంగా తయారవుతుంది.
జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి రసాయనాలు కలిగిన బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించడానికి బదులు సహజంగా లభించే మందారపు ఆకు, పూలు,ఉసరి పొడిని ఉపయోగించవచ్చు దీనికోసం మందారం ఆకులను లేదా పూలను పేస్టులా మార్చుకున్న తర్వాత అందులో ఉసరి రసాన్ని కలుపుకొని తల చర్మానికి అంటే విధంగా మర్దన చేసుకునీ అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే మందారం మరియు ఉసరిలో ఉండే సహజ ఔషధ గుణాలు చుండ్రు, జుట్టు రాలడం చిట్లడం వంటి సమస్యలను తగ్గించి అందమైన ఒత్తయిన కురులు మీ సొంతం చేస్తుంది.
కప్పు నీటిలో కొన్ని మందార ఆకులు, పువ్వులు వేసి కాసేపు చిన్న మంట పై మరిగించు కోవాలి. అది చల్లారాక ఆకుల్ని ముద్దలా చేసి కొద్దిగా సెనగపిండి కలిపితే షాంపూ తయారైనట్లే దీంతో తరచూ తలస్నానం చేస్తుంటే వీటిలోని యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రు సమస్యను తొలగించడంతోపాటు తల వెంట్రుకల కుదుళ్ళను దృఢంగా ఉంచి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.తెల్ల వెంట్రుకల సమస్యతో బాధపడేవారు మందార ఆకులు, పువ్వులను మెత్తటి పేస్టుగా మార్చుకొని అందులో తగినంత పులిసిన పెరుగు, గోరింటాకు రసం కలిపిన మిశ్రమాన్ని తల వెంట్రుకలకు అంటే విధంగా
మర్దన చేసుకుంటే తెల్ల వెంట్రుకలు సమస్య తగ్గి వెంట్రుకలు నల్లగా, దృఢంగా తయారవుతాయి.