అతిగా నిద్రపోయే వాళ్లకు షాకింగ్ న్యూస్.. ఈ ప్రమాదకర సమస్యలు వచ్చే ఛాన్స్!

మనలో చాలామంది ఎక్కువ సమయం పాటు నిద్రపోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ టైమ్ నిద్రించడం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. అతిగా నిద్రపోవడం (హైపర్సోమ్నియా) అనేది ఆరోగ్యానికి తీవ్ర హానికరం అని చెప్పవచ్చు. ఎక్కువ సమయం పాటు నిద్రపోవడం వల్ల అభిజ్ఞా రుగ్మత అభివృద్ధి చెందే ప్రమాదం ఉంటుందని చెప్పవచ్చు.

ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశంతో పాటు నిరాశ చెందే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ సమయం నిద్ర పోవడం వల్ల హార్మోన్ల నియంత్రణపై అంతరాయం కలిగే ఛాన్స్ ఉంటుంది. ఆకలి, సంతృప్తి లాంటి పనులకు బాధ్యత వహించే హార్మోన్లపై నియంత్రణ లేకపోవడంతో అతిగా తినే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

షిఫ్ట్ వర్క్, కుటుంబ అవసరాలు, చదువు లేదా సామాజిక జీవితం, నిద్ర రుగ్మతలు అతినిద్రకు కారణం అవుతాయి. హార్మోన్ల అసాధారణ సమతుల్యత, పార్కిన్సన్స్ లేదా చిత్తవైకల్యం అతినిద్రకు కారణమవుతాయి. సాధారణంగా ఒక వ్యక్తికి రోజుకి 8 గంటల నిద్ర సరిపోతుందని చెప్పవచ్చు. శరీరానికి తగినంత నిద్ర లేని పక్షంలో మెదడు సరిగ్గా పని చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల శరీరంలో చురుకుదనం తగ్గుతుంది. ఎక్కువ టైమ్ నిద్రపోతే ఒత్తిడి హార్మోన్లు విడుదలై మానసిక ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువ సమయం నిద్రపోతే షుగర్ లెవెల్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అధిక నిద్ర గుండె జబ్బుల రిస్క్ ను పెంచే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ సమయం నిద్రపోయే వాళ్లు అ అలవాట్లను మార్చుకుంటే మంచి లాభాలు ఉంటాయి.