మనలో చాలామంది ఒక్కొక్కరు ఒక్కో తరహా ఆహారపు అలవాట్లను కలిగి ఉంటారు. కొంతమంది ఉదయం సమయంలో అల్పాహారం తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపరు. అయితే ఏదైనా కారణాల వల్ల బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే మాత్రం కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చాలామంది బరువు తగ్గాలనే ఆలోచనతో బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం జరుగుతుంది.
అయితే ఎవరైతే బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఉంటారో వాళ్లు బరువు తగ్గే అవకాశం కంటే పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్ లో ఎక్కువ మొత్తం ఆహారం తీసుకుంటే కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పవచ్చు. ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే టైప్-2 డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.
టైప్2 డయాబెటిస్ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఎవరైతే బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తారో వాళ్ల మానసిక ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదని తెలుస్తోంది. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల శరీరంలో మార్పులు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.
సరైన సమయానికి బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే శరీరంలో పోషకాల లోపం ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఇప్పటికే తప్పులు చేస్తున్న వాళ్లు ఇకనైనా ఆ అలవాట్లను మార్చుకుంటే మంచిది. అల్పాహారం విషయంలో తప్పులు చేయడం వల్ల నష్టమే తప్ప ఏ మాత్రం లాభం అయితే ఉండదని చెప్పవచ్చు.