Hair: బాహ్య సౌందర్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో.. జుట్టుకు కూడా అంతే ప్రాముఖ్యం ఇస్తాం. జుట్టు ఒత్తుగా ఉండేందుకు ఎన్నో క్రీములు, మాయిశ్చరైజర్లు, ఆయిల్స్.. వాడుతూంటాం. తెల్ల జుట్టు కనిపిస్తే అసలు తట్టుకోలేం. రంగు వేయకుండా నల్లగా చేసుకోలేమా.. అని తెగ ఆలోచిస్తాం. ఒక్క వెంట్రుక తెల్లబడినా మిగిలిన ఇక తెల్లబడటం జరుగుతూనే ఉంటుంది. జుట్టు ఒత్తుగా ఉందా లేదా అనేది చూసుకుంటే.. తెల్లబడినా పెద్దగా బాధ ఉండదు. అలాంటి వారి కోసం ఓ చిట్కా ఉంది. ఎటువంటి కెమికల్స్ లేని విధానం అది. పెద్దగా కష్టపడక్కరలేని ఈ విధానానికి కావల్సింది బంగాళాదుంపల తొక్కలు.
వాటిలో కాటెకోలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది. దీనిని చర్మం నిగనిగలాడేందుకు ఉపయోగించే కాస్మొటిక్స్ లో వాడతారు. దీని ద్వారానే జుట్టుకు నలుపు రంగు కూడా తెచ్చుకోవచ్చు. ఎలా తయారు చేయాలంటే.. బంగాళా దుంపల్ని ఓ 20 నిమిషాలపాటు ఉడకబెట్టాలి. తర్వాత తొక్కలు తీసేయాలి. తొక్కలను మిక్సీలో వేసి పేస్టులా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత తల స్నానం చేయాలి. ఆపై తడి జుట్టును పొడిగా చేసి.. దానిపై ఈ బంగాళాదుంపల పేస్టును జుట్టుకు రాయాలి. పేస్టు జుట్టు కుదుళ్లకు అంటుకునేలా రాయాలి. 15 నిమిషాల్లో బంగాళాదుంప తొక్కల్లోని కాటెకోలేస్ జుట్టుకు చేరుతుంది.
పావుగంట గడిచాక జుట్టును నీళ్లతో.. లేదంటే తక్కువ కెమికల్స్ ఉన్న షాంపూతో కడిగేయాలి. దీంతో జుట్టు నలుపులోకి మారినట్టు తెలుస్తుంది. వారానికి 2-3సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటి సింపుల్ ట్రిక్స్ తో జుట్టు రంగును నలుపులో పొందొచ్చు. జుట్టు నల్లగా మాత్రమే కాదు.. ఒత్తుగా పెరుగుతుంది కూడా. అలా కాకుండా హెయిర్ డై వాడితే అందులోని కెమికల్స్ జుట్టుకు హాని చేయొచ్చు. దీనివల్ల మనలో సైడ్ ఎఫెక్టులను వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఈ సింపుల్ వంటింటి చిట్కా ట్రై చేస్తే సమస్యే ఉండదు.
గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం, జుట్టు విషయంలో ఎటువంటి సమస్య, సలహాలకైనా వైద్యులు, నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. అర్హత కలిగిన నిపుణుల అభిప్రాయాలకు ఈ కథనం ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.