ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా తెల్లజుట్టు సమస్య వేధిస్తోంది. అయితే తెల్లజుట్టు సమస్య వల్ల చాలామంది ఆత్మనూన్యతా భావంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే బీట్ రూట్ జ్యూస్ తో తెల్లజుట్టు సమస్యలకు సులువుగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తెల్లజుట్టు కోసం చాలామంది హెయిర్ డైలపై ఆధారపడుతూ ఉంటారు. హెయిర్ డైలు తెల్లజుట్టును తాత్కాలికంగా కవర్ చేసినా మెదడు లోపలి నరాలను దారుణంగా దెబ్బ తీసే ఛాన్స్ అయితే ఉంటుంది.
బీట్రూట్ జ్యూస్ తో ఈజీగా తెల్ల జుట్టుకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. బీట్రూట్ జ్యూస్ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఇ, విటమిన్-సి జుట్టుకు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. బీట్రూట్ జ్యూస్ లో ఉండే విటమిన్-సి కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుందని చెప్పవచ్చు. ఉసిరి పొడి, ఆలివ్ నూనె, అల్లం రసంతో బీట్రూట్ హెయిర్ డైని తయారు చేయవచ్చు.
బీట్రూట్ జ్యూస్ లో పైన చెప్పిన పదార్థాలు అన్నీ వేసి బాగా మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేస్తే మంచిది. దాదాపు రెండు గంటల పాటు అలాగే ఉంచి సాధారణ నీటితో జుట్టును కడుక్కోవాలి. ఈ విధంగా చేయడం వల్ల జుట్టు ముదురు రంగులోకి మారుతుంది. ఎలాంటి హానికరమైన పదార్థాలు లేకపోవడం వల్ల ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉండదని చెప్పవచ్చు.
వారానికి ఒకసారి ఈ హెయిర్ డైని అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తెల్ల జుట్టు సమస్య ఉన్నవాళ్లు ఎక్కువగా హెయిర్ డైలపై ఆధారపడటం మాత్రం మంచిది కాదని చెప్పవచ్చు. ఈ చిట్కాలతో తెల్లజుట్టు సమస్య సులువుగా దూరమవుతుంది.