తెల్ల జుట్టు సమస్యతో బాధ పడుతున్నారా.. ఈ సమస్యకు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలివే!

ఈ మధ్య కాలంలో చాలామంది తెల్లజుట్టు సమస్యతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. తెల్లజుట్టు కవర్ చేయడం కోసం హెయిర్ డైలపై ఆధారపడుతున్నారు. హెయిర్ డై లలో రసాయనాల వల్ల మెదడు నరాలు దెబ్బ తినే అవకాశాలు అయితే ఉంటాయి. కొబ్బరినూనె, మెంతులు, పెరుగు, బీట్ రూట్ లను మిక్స్ చేసుకుని తయారు చేసుకున్న మిశ్రమాన్ని తలకు పట్టించి గంటసేపు అలాగే ఉంచి వారానికి ఒకసారి జుట్టుకు అప్లై చేస్తే మంచిది.

జుట్టు నల్లగా మారడానికి సహజమైన ఇతర హెయిర్ ప్యాక్ లు కూడా ఉపయోగించవచ్చు. భృంగరాజ్ పౌడర్, ఉసిరి పౌడర్ ను కొబ్బరి నూనెలో కలిపి మిక్స్ చేసి దాన్ని తలకు పట్టించడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ న్యాచురల్ చిట్కాలను పాటించడం ద్వారా శరీరానికి ఎలాంటి హాని కలిగే అవకాశం అయితే ఉండదు.

జుట్టు నెరసిపోవడం సర్వసాధారణమైన విషయం కాగా తక్కువ వయసు ఉన్న వారు కూడా ఈ సమస్య బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఒత్తిడి కూడా తెల్ల వెంట్రుకలకు కారణమవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. శరీరంలో పోషక లోపం కారణంగా కూడా జుట్టు తెల్లబడే అవకాశాలు అయితే ఉంటాయి. ఎక్కువసేపు ఎండకు గురికావడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే మెలనిన్ తగ్గుతుంది.

విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఉసిరిని తీసుకుంటే ఈ సమస్య కొంతమేర దూరమవుతుంది. ఉసిరి రసాన్ని ఖాళీ కడుపుతో తాగడం వల్ల మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఉల్లిపాయ రసంలో సల్ఫర్, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్డగా వారానికి రెండుసార్లు ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టిస్తే తెల్ల జుట్టు సమస్య దూరమవుతుంది.