ప్రస్తుత కాలంలో చాలామందిని తెల్లజుట్టు సమస్యలు వేధిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ అందంగా కనిపించడంలో జుట్టు ఎంతో కీలకం అని చెప్పవచ్చు. నల్లగా నిగనిగలాడే జుట్టు ఉన్నవాళ్లకు ఆత్మవిశ్వాసం ఒకింత ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత కాలంలో చాలామందిని జుట్టు సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. జుట్టు బలహీనంగా మారి రాలిపోవడం కొందరి సమస్య కాగా చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం వల్ల మరి కొందరు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే ఒక హెయిర్ ప్యాక్ సహాయంతో జుట్టుకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు. ఇనుప పాత్రలో ఉసిరి పొడి, కరివేపాకు పొడి, పెరుగు, నీరు వేయడంతో పాటు గోరింటాకు పొడి, మందార పొడి వేసి బాగా కలపాలి. ఇనుప పాత్ర మీద మూత పెట్టి ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే ఉంచి ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాలి. సుమారు 3 గంటల పాటూ దీన్ని అలాగే ఉంచి 3 గంటల తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి.
ఎక్కువసార్లు ఈ హెయిర్ ప్యాక్ ను అప్లై చేయడం ద్వారా సమస్యను అధిగమించే ఛాన్స్ ఉంటుంది. ఉదయం అల్పాహారం తిన్న తరువాత ఒక స్పూన్ ఉసిరి పొడిని తింటూ హెర్బల్ ఆయిల్ ను అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. రాత్రి భోజనం చేసిన తరువాత 1 టీ స్పూన్ నల్లనువ్వులను బాగా నమిలి తింటే ఆరోగ్యానికి మంచిది. జుట్టు పెరగడానికి, జుట్టు నల్లగా మారడానికి ఇవి సహాయపడతాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
జుట్టు సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకుంటే మంచిది. జుట్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదని చెప్పవచ్చు. జుట్టు విషయంలో తప్పులు చేస్తే ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు.