ఆస్తమా సమస్యతో బాధ పడుతున్నారా.. ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

మనలో చాలామందిని వేధించే ఆరోగ్య సమస్యలలో ఆస్తమా ఒకటి కాగా ఈ సమస్య వల్ల దీర్ఘకాలంలో ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా ఆస్తమా సమస్యను దూరం చేసుకోవచ్చు. ఆధునిక జీవనశైలి, కాలుష్యం వల్ల చాలామందిని దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధిత ఆస్తమా, ఇతర సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి.

ఆస్తమా సమస్యతో బాధ పడేవాళ్లకు ఊపిరితిత్తుల్లో గాలిమార్గానికి అడ్డంకులు ఏర్పడటం వల్ల సమస్యలు వస్తాయి. దగ్గు, ఛాతిలో నొప్పి, ఆయాసం లాంటి సమస్యలు సైతం ఆస్తమాతో బాధ పడేవాళ్లను వేధించే అవకాశం ఉంటుంది. దుమ్ము,ధూళి, పెంపుడు జంతువులు, చల్లని గాలి, రసాయనాలు, ఫంగస్, అలర్జీ ఇతర సమస్యల వల్ల కూడా ఆస్తమా వస్తుందని చెప్పవచ్చు. శ్వాసకోశ సంబంధిత ఆస్తమాకు ఇతర కారణాలు సైతం ఉంటాయి.

సహజమైన ఇంటి చిట్కాలతో ఆస్తమా సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆయుర్వేద మూలికా ఔషధాలను తీసుకోవడం ద్వారా కూడా ఆస్తమా సమస్య దూరమవుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఆస్తమా సమస్య దూరమవుతుంది. డీకాంగెస్టెంట్ స్ప్రేల వినియోగం లేకుండా ఆస్తమా సమస్యకు చెక్ పెట్టవచ్చు. క్రమం తప్పకుండా శారీరక శ్వాస వ్యాయామాలు చేయడం, స్విమ్మింగ్ చేయడం ద్వారా దీర్ఘకాలిక ఆస్తమా సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

వెల్లుల్లి రెబ్బల ముక్కలతో వేడి అల్లం టీ తాగడం ద్వారా కూడా ఈ సమస్య దూరమవుతుంది. వంటగదిలో సరైన వెంటిలేషన్ లేకుండా చూసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. పెర్ఫ్యూమ్‌లు,ఎయిర్ ఫ్రెషనర్‌లను నివారించడం ద్వారా కూడా ఆస్తమాకు చెక్ పెట్టవచ్చు. పాలిస్టర్ బెడ్ షీట్లు మరియు దిండ్లు ఉపయోగించడం ద్వారా ఈ సమస్య దూరమవుతుంది.

నల్ల మిరియాలు, అల్లం రూట్ పొడి మరియు ఒక టీస్పూన్ తేనె మిశ్రమం తీసుకోవడం ద్వారా కూడా ఆస్తమా సమస్యను దూరం చేసుకోవచ్చు. విటమిన్స్ ఎ, ఇ, సి మరియు బీటాకెరోటిన్ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. పుదీనా తయారైన మింట్ ఆయిల్ శ్వాసనాళ ఇబ్బందులను, వాపు, మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఆస్తమా సమస్యను నివారించటంలో రోజువారి వ్యాయామాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పవచ్చు.