మన శరీరంలో మెదడు అత్యంత కీలకమైన అవయవం. ఇది మన నాడీ వ్యవస్థను నియంత్రించి, ప్రతి చర్యను సమర్థవంతంగా నడిపిస్తుంది. అలాంటి మెదడులో ఏ చిన్న సమస్య వచ్చినా అది శరీరాన్ని సమూలంగా ప్రభావితం చేస్తుంది. మెదడులో వాపు వస్తే ఇక అంతే.. వైద్యపరంగా దీనిని సెరిబ్రల్ ఎడెమా అని అంటారు. అది అత్యంత ప్రమాదకర పరిస్థితి. దీనిని గుర్తించడంలో జాప్యం జరిగితే… అది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి వేస్తుంది. సెరిబ్రల్ ఎడెమా ముఖ్యంగా గాయాలు, ఇన్ఫెక్షన్లు లేదా ఇతర మెదడు వ్యాధుల కారణంగా వస్తుంది. ఈ సమస్యను తొందరగా గుర్తించాలంటే కొన్ని ముఖ్యమైన సంకేతాలను గమనించాలి అవేంటో ఇప్పుడు చూద్దాం.
తీవ్ర తలనొప్పి: ఏ కారణం లేకుండా తలనొప్పి కొనసాగితే… లేదా రోజు రోజుకీ పెరుగుతుంటే… అది మెదడులో సమస్యకు సంకేతం కావొచ్చు. వాంతులు, తలతిరగడం, ఒళుసు వంటి లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.
కళ్ల ముందు మసకగల దృష్టి: మెదడు వాపు వల్ల చూపుపై ప్రభావం పడుతుంది. ఇది అస్పష్టమైన దృష్టిని కలిగించవచ్చు. కొన్ని సందర్భాల్లో కళ్ల ముందు చీకటి పడినట్టు కూడా అనిపించవచ్చు.
కండరాల్లో బలహీనత: చేతులు, కాళ్లల్లో బలహీనత కలిగితే, ముఖంలో తిమ్మిరి వచ్చినట్టే అనిపిస్తే లేదా నడిచే సమయంలో అస్థిరంగా అనిపిస్తే, అది మెదడులో వాపుకు సంబంధించిన సంకేతం కావొచ్చు. ఒకవైపు మాత్రమే ఈ లక్షణాలు కనిపిస్తే అది నాడీ సంబంధిత లోపానికి సూచన.
మతిమరుపు లేదా మూర్ఛ:సెరిబ్రల్ ఎడెమా మెదడు సాధారణ పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఇది మతిమరుపు, గందరగోళం లేదా అసాధారణ ప్రవర్తనకు దారితీస్తుంది. తీవ్రంగా ఉన్నప్పుడు మూర్ఛ Episodes కూడా కలుగవచ్చు.
మెడలో గట్టి పట్టు లేదా నొప్పి: మెడలో తీవ్ర నొప్పి, గట్టిగా బిగుసుకుపోయిన భావన ఉంటే, అది మెదడులో వాపుతో పాటు ఇతర నాడీ సంబంధిత సమస్యల సంకేతం కావొచ్చు.
రక్తపోటు అకస్మాత్తుగా పెరగడం: బిపి ప్రాబ్లం లేకపోయినా పదే పదే రక్తపోటు పెరిగితే, మెదడులో వాపును సూచించే సంకేతంగా ఇది పరిగణించవచ్చు. ఈ లక్షణాలన్నీ అత్యంత జాగ్రత్తగా గమనించాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఈ సూచనల్ని పట్టించుకుని వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. (గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం జనరల్ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకాదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, నిపుణుల సలహా తీసుకోవడం అత్యవసరం.)