ఆ ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచిదట.. ఆ టెంపుల్ ఎక్కడంటే?

బడికి వెళ్లబోయే పిల్లల విషయంలో తల్లీదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లలకు సరస్వతీ దేవీ సమక్షంలో అక్షరాభ్యాసం చేయించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అవనం కోడ్ సరస్వతీ దేవీ ఆలయంలో పిల్లలు, ఉన్నత విద్యావంతులు, పెద్దపెద్ద అధికారులు సైతం అక్షరాభ్యాసం చేయించుకున్నారు. పరశురాముడు ఈ ఆలయాన్ని నిర్మించారు.

జగద్గురు ఆదిశంకరాచార్యులకు ఈ ఆలయంలో అక్షరాభ్యాసం జరిగిందని సమాచారం అందుతోంది. ఆది శంకరాచార్యులు శంకరాచార్యుల తల్లి ఈ ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారి సమక్షంలోనే అక్షరాభాస్యం చేయించారని సమాచారం. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆవనం కోడ్ సరస్వతీ ఆలయం కేరళ రాష్ట్రంలోని కొచ్చి విమానాశ్రయానికి దగ్గరగా ఉంటుంది.

ఎవరైతే ఇక్కడ అక్షరాభాస్యం చేయించుకుంటారో వాళ్లు చదువుతో పాటు వక్కును పొందుతారని బలంగా నమ్ముతారు. ఈ ఆలయంలో అమ్మవారితో పాటు జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తినీ ఆటంకాలు తొలగించే వినాయకుడిని దర్శించుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఒకానొక సమయంలో ఒక ఊరివాళ్లు గడ్డి కోసేందుకు వెళ్లగా ఒక కొడవలి రాయికి తగిలి నెత్తురు వచ్చిందట.

సరిగ్గా అదే సమయంలో పరశురాముడు అక్కడికి వచ్చి ఆ శిలలో సరస్వతీ దేవి ఉందని గ్రహించి ఆ శిలనే ప్రతిష్టించి ఆలయం నిర్మించాడని కథనం. పరశురాముడు నిర్మించిన 108 దుర్గాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి కావడం గమనార్హం. ఈ ఆలయంలో ప్రధానంగా విద్యారంభం, విద్యా వాగీశ్వరి పేర్లతో అక్షరాభ్యాసాలు చేయించడం జరుగుతుంది. విజయదశమి, గ్రంథ పూజగా పిలిచే ప్రత్యేక దినాల్లో తప్ప మిగతా రోజుల్లో ఈ ఆలయంలో అక్షరాభ్యాసాలు చేయించుకోవచ్చు.

ఈ ఆలయంలో అమ్మవారిని పూజించిన బియ్యాన్ని తీసుకొచ్చి “ఓం హరి శ్రీ గణపతయే నమః” అని పిల్లల చేత రాయించడం జరుగుతుంది. తర్వాత అదే నామాన్ని నాలుకపై రాస్తారు. ఆలయానికి వచ్చే భక్తులు ప్రాంగణంలో ఇసుకలో అక్షరాలు రాయడాన్ని కూడా చూడవచ్చు. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఈ టెంపుల్ ఉంటుంది. విమాన మార్గం ద్వారా కూడా ఈ ఆలయాన్ని సులువుగా దర్శించుకోవచ్చు.