ఎల్ఐసి పాలసీదారులు పాన్ కార్డుని లింక్ చేయాలా… ఇంట్లో నుంచే ఇలా చేయండి..?

భారతదేశంలో బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి పౌరుడికి పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. పాన్ కార్డు మనిషికి గుర్తింపు కార్డుగా భావించవచ్చు. ఇదిలా ఉండగా ఇటీవల ఎల్ఐసి పాలసీదారులు అందుకే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక లావాదేవీలు జరగాలంటే తప్పనిసరిగా పాన్ కార్డు ఉండాలని సూచించింది. ఈ క్రమంలోనే తమ ఖాతాని పాన్ కార్డుతో లింక్ చేయవలసినదిగా పాలసీ హోల్డర్‌లను కోరింది. పాలసీదారులు ఎల్‌ఐసీ డాక్యుమెంట్లలో తమ పాన్ నంబర్‌ను అప్‌డేట్ చేయడం తప్పనిసరి అని తెలిపింది.

LIC పాలసీదారులు మార్చి 31 2023 లోగా తమ ఖాతాకు పాన్ కార్డు లింక్ చేయాలని సూచించింది. పాలసీదారులు మార్చ్ 31వ తేదీలోగా తమ ఖాతాకు తప్పనిసరిగా పాన్ నెంబర్ లింక్ చేయాలి, లేనిచో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే ఆన్లైన్ లో LIC పాలసీకి పాన్ కార్డును ఎలా లింకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. LIC వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ linkpan.licindia.in/UIDSedingWebApp/getPolicyPANStatus లో లాగిన్ అవ్వాలి.
లాగిన్ అయిన తర్వాత పాలసీ నంబర్‌ను నమోదు చేయండి. అలాగే మీ పాన్ వివరాలు , క్యాప్చా కోడ్‌తో పాటు మీ పుట్టిన తేదీని నమోదు చేసి ‘Submit’ బటన్‌ను ఎంచుకోండి.

ఇక ఇప్పుడు మీ LIC పాలసీ , PAN లింక్ అయిన సమాచారం మీ ఫోన్ స్క్రీన్ లేదా కంప్యూటర్ మానిటర్‌పై కనిపిస్తుంది. ఒకసారి మీ PANని మీ LIC పాలసీలకు లింక్ చేయకపోతే, “click here to register your PAN with us” కనిపిస్తుంది.
మీరు అక్కడ క్లిక్ చేస్తే, కొత్త పేజీ తెరుచుకుంటుంది. మీరు అక్కడ మీ పేరు పూర్తి వివరాలు అందించాలి.
మీ పేరు వివరాలతో పాటు ఇ-మెయిల్ చిరునామాను నమోదు చేయండి. మీ పూర్తి పేరు, ఫోన్ నంబర్ , పాలసీ నంబర్‌ను పాన్ కార్డ్‌లో కనిపించే విధంగా నమోదు చేయండి. క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, ‘Get OTP’ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత OTPని ఎంటర్ చేస్తే మీ PAN , LIC పాలసీ లింక్ మీ కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.